అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

చీఫ్‌ ఇంజనీర్‌

నాగప్రసాద్‌

చిట్యాల/మొగుళ్లపల్లి: వినియోగదారులకు నాణ్య మైన, అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని చీఫ్‌ ఇంజనీర్‌, నోడల్‌ అధికారి నాగప్రసాద్‌ అన్నారు. శుక్రవారం చిట్యాల మండలంకేంద్రంలోని 32/33 కేవీ సబ్‌స్టేషన్‌, మొగుళ్లపల్లి విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రిడ్‌ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. రానున్న కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సబ్‌స్టేషన్‌ పిరిధిలో ఎప్పటికప్పుడు పనులు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సూపరింటెండెంట్‌ ఇంజనీరు నాగెల్లి సదానందం, డీఈ పాపిరెడ్డి, అసిస్టెంట్‌ డివి జన్‌ ఇంజనీర్‌ పి.సుందర్‌కుమార్‌, చిట్యాల విద్యుత్‌ శాఖ ఏఈలు చంద్రశేఖర్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement