గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

– 8లోu పొదుపుగా వాడాలి..

న్యూస్‌రీల్‌

ఈ నెలలో వర్షాలు కురవకుంటే కష్టాలే..

ఇప్పటికే పలు మండలాల్లో లోటు వర్షపాతం

రెండు రోజులుగా మండుతున్న ఎండలు

పొదుపుగా వాడితేనే జలసంరక్షణ

భూపాలపల్లి రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి ఇప్పటివరకు సమృద్ధిగా వర్షాలు కురువలేదు. కొన్నిచోట్ల వానలు సాధారణం కంటే తక్కువగా పడ్డాయి. దీంతో ఆయా మండలాల్లో భూగర్భజలాలు లోతులో ఉన్నాయి. ఆగస్టు నెల వరకు జిల్లాలో భూగర్భ జలాల సగటు లభ్యత 10.22 మీటర్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో జిల్లా సగటు చూస్తే 8.44 మీటర్లుగా ఉంది. ఇప్పటికీ జిల్లాలో గోదావరి తీరప్రాంతమైన మహదేవపూర్‌, పలిమెల ప్రాంతాల్లోనూ నీటి లభ్యత తక్కువగానే ఉంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కీలకమైన నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నదిలోకి వరద చేరేది. ఈసారి రెండు సార్లు మినహా భారీగా వరదలు రాలేదు. దీంతో భూమిలోకి నీరు ఇంకకపోవడంతో నీటిలభ్యత తగ్గుతోంది.

ఎండలు పెరిగితే..

రెండు రోజులుగా ఎండకాలాన్ని తలపిస్తూ ఉక్కపోత, వేడిమి పెరుగుతోంది. వానా కాలంలోనూ ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో పంటలకు నీటి అవసరం ఎక్కువ అవుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి వాడకం పెరుగుతుంది. దీంతో భూగర్భజలాల వాడకంగా ఉన్న బావులు, బోర్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని తోడాల్సి వస్తుంది. వేసవి తరహాలోనే వానాకాలంలోనూ బోర్లు, బావులపై ఆధా రపడాల్సి వస్తోంది. దీంతో వేగంగా భూగర్భజలాలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పలు మండలాల పరిధిలో నీటి లభ్యత లోతుకు చేరుతోంది. ఈ నెలలో వర్షాలు ఆశించిన మేర పడకపోతే నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో పంటలు కాపాడుకోవడానికి నీటిని అధికంగా వినియోగించాల్సి ఉంది. మరోవైపు గృహ, వాణిజ్య, పరిశ్రమల కోసం పట్టణాలు, జిల్లాకేంద్రంలో విచ్చలవిడిగా బోర్లు వాడుతున్నారు. దీంతో వేగంగా నీటి లభ్యత తగ్గుతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని భూగర్భజల సంరక్షణ అధికారులు కోరుతున్నారు.

భూగర్భ జలాలు (మీటర్లలో)..

మండలం ఆగస్టు 2025 ఆగస్టు 2026

ఈ నెలలో తగినంత వర్షం కురవకపోతే క్రమంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికై తే జిల్లాలో సాధారణ స్థితిలోనే ఉన్నాయి. భూగర్భ జలాలను అందరూ అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలి. భూగర్భజలాలను పెంచుకునే విధంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి.

– శైలశ్రీ, జిల్లా ఇన్‌చార్జ్‌

భూగర్భ జల అధికారి

జిల్లాలో వర్షపాతం వివరాలు (మీ.మీ)

నెల సాధారణం వర్షపాతం

జూన్‌ 152.9 120.8

జూలై 322.9 367.8

ఆగస్టు 292.2 172.6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement