భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు సంబంధించిన పెర్క్స్‌పై ఇన్‌కం ట్యాక్స్ రద్దు ఏఐటీయూసీ నిరంతర పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఏరియాలోని కేటీకే ఓసీ–2 గనిలో బుధవారం ఫిట్ సెక్రటరీ కరీముల్లా అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌లో రాజ్‌కుమార్ మాట్లాడారు. ఇటీవల రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో అనేక కార్మిక డిమాండ్లపై ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. అందులో ముఖ్యంగా కార్మికుల పెర్క్స్‌పై ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయడమే కాకుండా, కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. 2016–17 జేఎంఈటీ ఉద్యోగులకు ఖాళీల ఆధారంగా కాకుండా ప్రమోషన్లు కల్పించేందుకు అంగీకారం లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు తోట రాంచందర్, డీఎస్ సింగ్, పి.నారాయణ, చేరాలు, కృష్ణ పాల్గొన్నారు.


