● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
టేకుమట్ల: శాంతి భద్రతల పరరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సతీష్, ఎస్సై అమూల్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


