పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

భూపాలపల్లి: జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ తెలిపారు. జిల్లాకేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ క్రీడాప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసనసభ ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని కలెక్టర్‌ వివరించారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

జెండా ఎగుర వేయనున్న

విప్‌ శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement