● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: పంద్రాగస్టు నుంచి అర్హులకు కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం మండలంలోని కనిపర్తి, రేపాక, లింగాల, కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడేపాక గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, పీఆర్ డీఈ రవికుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు సాదు సుమలత, గుల్ల అరుణ, సురేష్, సువర్ణ, నాయకులు పున్నం రవి, తిరుపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు.


