పేదలకు పట్టాలివ్వాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

పేదలకు పట్టాలివ్వాలని ధర్నా

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

భూపాలపల్లి అర్బన్‌: పట్టణంలోని సర్వే నెంబర్‌ 280లో నివసిస్తున్న భగత్‌సింగ్‌ కాలనీవాసులకు పట్టాలివ్వడంతో పాటు ఇంటినంబర్లు మంజూరు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలు ఎన్నిసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు. కలెక్టర్‌, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భగత్‌సింగ్‌ కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement