పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో పోలీసు సేవలను మరింత మెరుగుపర్చే దిశగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ బుధవారం భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రికార్డులు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించేలా పనిచేయాలని సిబ్బందికి ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement