వెంకటాపురం(ఎం): విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి లక్ష్యంతో చదివాలని ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికా సం, పరీక్షల పట్ల భయాన్ని తొలగించుకోవడంపై ఎలా అనే ఆంశాలపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి, ఇంటిలిజెన్స్ ఎస్పీ రమేశ్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. చదువుకోవాల నే తపన, ఆశయం, సంకల్పం బలంగా ఉంటే మి మ్మల్ని ఏ శక్తి కూడా ఆపలేదని వెల్లడించారు. కొత్త విషయాలు, తెలియని అంశాలు నేర్చుకోవడానికి ఎప్పుడు వెనుకాడరాదని వివరించారు. సక్సెస్ అనే ది ప్రయత్నం చేయడంలోనే ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశ్నలు వే స్తూ జవాబులు రాబడుతూ వారికి బహుమతులను అందించి ఉత్సాహపరిచారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రాధిక, ఎస్సై రాజు, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, కిరణ్, అంబేడ్కర్, కి శోర్‌బాబు, వేణు, సంధ్యారాణి, జోత్స్న పాల్గొన్నారు.
ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్


