వాజేడు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రణాళికతో బోధించి మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని కాచారం పాఠశాలతో పాటు పెద్దగొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించారు. పాఠాలు చదివించి.. రాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చదువులో వెనుక బడిన వారిని గుర్తించి అందరితో సమానంగా చదివేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాలన్నారు. చదువుపై శ్రద్ధ చూపేలా బోధించాలన్నారు. పెద్ద గొళ్లగూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య తగ్గడంపై ప్రశ్నించారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


