శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

కమిషనరేట్‌లో బాధ్యతల స్వీకరణ

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత పేర్కొన్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్‌ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్‌కు చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్‌బుక్స్‌ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement