బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

ములుగు రూరల్‌: బాలకార్మిక వ్యవస్థను జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌కేకన్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. జిల్లాను బాల కార్మికుల రహిత జిల్లాగా మార్చుకునేందుకు పాటుపడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, డీఎస్పీ కిశోర్‌, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌, జిల్లా కార్మికశాఖ అధికారి వినోద తదితరులు పాల్గొన్నారు.

ములుగు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement