వర్షపాతం వివరాలు (మి.మీ)
భూపాలపల్లి రూరల్: వారం రోజులుగా భారీవర్షం కురుస్తుందా అన్నట్లుగానే పొద్దంతా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడుతుంది. ఊరిస్తున్న మబ్బులు చివరకు చిరుజల్లులు కురిశాక వరుణ దేవుడు మొఖం చాటేస్తున్నాడు. జిల్లాలో ప్రతీరోజు ఇదే పరిస్థితి నెలకొంటుంది. వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రెండుసార్లు మోస్తారుగా వానలు కురిశాయే తప్పా భారీ వర్షాలు కురువలేదు. ఎల్‌నీఓ ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై నీలినీడలు అలుముకున్నాయి, సాగు ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే..
ఈ నెలలో జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో జిల్లావ్యాప్తంగా సగటున రెండు రోజులు మాత్రమే వర్షం కురియగా, అధికలోటు వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో టేకుమట్ల మండలంలో సాధారణ వర్షపాతం 149.9 నమోదు కాగా, ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. మిగితా మండలాల్లో పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్న పరిస్థితి నెలకొంది.
ఆలస్యం కానున్న మిర్చి, వరి సాగు..
సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురియకపోవడంతో మిర్చి, వరి పంటల సాగు ఆలస్యం కానుంది. వర్షాలు కురుస్తాయన్న ఆశతో కొందరు రైతులు బోరుబావుల వద్ద వడ్లను అలికారు. ప్రస్తుతం వరిపైరు నారు దశలో ఉంది. మరిన్ని వర్షాలు కురిస్తే పూర్తి స్థాయిలో నార్లు పోసుకోనున్నారు. లేదంటే వెదజల్లే పద్ధతి ద్వారా పంట సాగు చేసే అవకాశం ఉంది.
మండలం నమోదు సాధారణం లోటు
భూపాలపల్లి 180.9 155.9 +16
చిట్యాల 64.8 147.6 56
రేగొండ 101.2 145.4 30
గణపురం 183.6 143.7 +28
కొత్తపల్లిగోరి 83.7 145.4 42
టేకుమట్ల 149.2 149.8 0
మొగుళ్లపల్లి 84.6 146.9 42
మహదేవపూర్ 121.8 175.4 +31
పలిమెల 94.6 183.9 49
మహాముత్తారం 156.3 162.3 4
కాటారం 146.2 141.2 +4
మల్హర్ 80.6 138.7 42
మోస్తరు వానలు కురిసింది
రెండు రోజులే..
చెరువుల్లోకి చేరని నీరు
వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు


