బడి.. సమస్యల ఒడి | - | Sakshi
Sakshi News home page

బడి.. సమస్యల ఒడి

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

జిల్లాలో పాఠశాలలు

మొత్తం ఖాళీలు 286

అసంపూర్తిగా అభివృద్ధి పనులు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువు

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు

ఎస్జీటీ 191

స్కూల్‌ అసిస్టెంట్‌ 75

పీజీహెచ్‌ఎంలు 6

ఎల్‌పీలు 3

ఎల్‌ఎఫ్‌ఎల్‌

హెచ్‌ఎంలు 10

పీఈటీ 1

పేద విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ పాఠశాలలు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, సరిపడా తరగతి గదులు లేకపోవడం, గదుల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడం, అద్దె భవనాల్లో పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు నేడు ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చే హామీలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సాక్షి బృందం విజిట్‌ చేయగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. – భూపాలపల్లి అర్బన్‌

జిల్లాలో పాఠశాలలు 394

ప్రాథమిక 281

ప్రాథమికోన్నత 43

ఉన్నత 70

విద్యార్థులు 18వేలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement