ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

భూపాలపల్లి: భవిష్యత్‌ తరాలకు పచ్చని వాతావరణం అందించేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, ఆర్‌ఐలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి..

ఉద్యోగ విరమణ పొందినవారు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిని మంగళవారం పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ హాజరయ్యారు. ఉద్యోగ విరమణ పొందిన కొత్తపల్లిగోరి ఎస్సై–2 ఎండీ షాఖాన్‌, పీసీఆర్‌ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై పులియాల రాజిరెడ్డి, మొగుళ్లపల్లి ఏఎస్సై వెంకటరత్నంలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, ఉద్యోగ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి

మల్హర్‌(కాటారం): పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కాటారం పోలీస్‌స్టేషన్‌, సబ్‌ డివిజన్‌ పోలీస్‌ కార్యాలయాన్ని ఎస్పీ సంకీర్త్‌ సందర్శించి, సమగ్ర తనిఖీ నిర్వహించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్‌ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement