● డీఐఓ డాక్టర్ నాగరాణి
మల్హర్(కాటారం): ఐదేళ్లలోపు చిన్నారులందరూ పొలియో చుక్కలకు దూరం కావద్దని డీఐఓ నాగరాణి అన్నారు. మండలంలో కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న పల్స్‌పోలియో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాటారం గ్రామంలో సర్వే బృందాల పనితీరును సమీక్షింంచారు. ఐదేళ్లలోపు చిన్నారులందరినీ గుర్తించి పోలియో చుక్కలు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం కాటారంలోని లలిత క్లినిక్, భద్రకాళి ల్యాబ్‌ను ఆమె తనిఖీ చేసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మౌనిక, హెచ్‌వీ పద్మావతి, ఆశ కార్యకర్తలు రమాదేవి, రుక్సానా, రాజేశ్వరి పాల్గొన్నారు.


