చెట్టుకొమ్మ మీదపడి మేకల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టుకొమ్మ మీదపడి మేకల కాపరి మృతి

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

మహాముత్తారం: అడవిలోని చెట్టుకొమ్మ విరిగి పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కనుకునూర్‌ గ్రామానికి చెందిన పొడెం సమ్మక్క(39) ప్రతిరోజు మేకలు కాసేందుకు అడవికి వెళ్తోంది. మంగళవారం కూడా వెళ్లింది. ఈ క్రమంలో అడవిలో ఓచెట్టుకొమ్మ విరిగి మీద పడడంతో సమ్మక్క అక్కడికక్కడే మృతిచెందింది. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చాయి. సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప అడవిలోకి వెళ్లి గాలించగా చనిపోయి కనిపించింది. సోదరుడు బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్సై గొర్ల రమేశ్‌ తెలిపారు.

జీపీ కార్యదర్శుల డిప్యుటేషన్లు రద్దు

ఏటూరునాగారం: జిల్లాలోని 71 మంది పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్లను కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఇటీవల రద్దు చేశారు. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శులు తిరిగి వారి ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధుల్లో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన 71 మందిని వేర్వేరు ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement