● సీపీఓ జవహర్‌లాల్
భూపాలపల్లి: దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధిలో గణాంకాల పాత్ర అత్యంత కీలకమని సీపీఓ జవహర్‌లాల్ అన్నారు. ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త పీసీ మహలనోబిస్ జ్ఞాపకార్థం సోమవారం సీపీఓ కార్యాలయంలో జాతీయ గణాంక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఓ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో పీసీ మహాలనోబిస్ చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సీపీఓ శామ్యుల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాగా గణాంక అధికారులు కిష్టయ్య, వెంకటేశ్వర్లు, ఉప గణాంక అధికారులు మహేష్, బాబులాల్, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.


