సింగరేణి వ్యాప్తంగా పీఆర్పీ బకాయిలు (రూ.కోట్లలో)
ప్రధాన డిమాండ్లు ఇవే..
యాజమాన్యం స్పందించాలి..
● మూడేళ్లుగా వేతన సవరణ పెండింగ్
● దశల వారీగా అందోళన, నిరసన కార్యక్రమాలు
● పట్టించుకోని యాజమాన్యం, పాలకులు
● నేటి నుంచి జీఎం కార్యాలయం ఎదుట దీక్షలు
2,200 మంది అధికారులు
రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా 2,200 మంది అధికారులు పనిచేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో సుమారు 250 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ చెల్లించాల్సి ఉంది. ఈ–వన్ గ్రేడ్ నుంచి ఈ–8 గ్రేడ్ వరకు పీఆర్పీ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో అఽధికారికి సీనియారిటీ ప్రకారం ఏడాదికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు పీఆర్సీ వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండేళ్ల బకాయిలు సుమారు రూ.277కోట్లు రావాల్సి ఉందని.. మరోఏడాది లెక్క తేలాల్సి ఉందంటున్నారు. తమను యాజమాన్యం పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో సింగరేణి అధికారులు ఉన్నారు. తమకు పీఆర్పీ చెల్లించకుండా యాజమాన్యం చిన్న చూపు చూస్తోందని అధికారులు వాపోతున్నారు.
దశల వారీగా ఆందోళనలు
సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు అధికారులు పిలుపునిచ్చారు. తొలిదశలో కార్మికవాడల నుంచి జీఎం కార్యాలయాల వరకు ఆందోళన నిర్వహించారు. జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. రెండోదశలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు. నేటినుంచి రిలే నిరాహార దీక్షలకు స్పందించకపోతే ప్లేడేలు, బాయికాట్ చేయడం, వర్క్ టూ రూల్ పాటించనున్నట్లు సింగరేణి అధికారుల సంఘం ప్రకటించింది.
సింగరేణిలో ఉత్పత్తిని పరుగులు పెట్టించే అధికారుల సంక్షేమాన్ని యాజమాన్యం, పాలకులు పక్కనబెట్టారు. ఏకంగా మూడేళ్లుగా అధికారుల వేతన సవరణ (పీఆర్సీ) ఊసే ఎత్తకపోవడంతో సింగరేణి అధికారులు ఇక ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. చర్చల దశ దాటి నేటినుంచి క్షేత్రస్థాయిలో ఆందోళనలకు దిగుతున్నారు. నేటినుంచి సింగరేణి అధికారుల పోరుబాట ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడే ప్రమాదం ఉంది.
– భూపాలపల్లి అర్బన్
ఆర్థిక సంవత్సరం బకాయిలు
2022–23 రూ.117కోట్లు
2023–24 రూ.127కోట్లు
2024–25 రూ.150 కోట్లు
మూడేళ్ల పీఆర్పీ చెల్లించాలి
పదోన్నతి పాలసీ రూపొందించి అమలు చేయాలి
పారదర్శకంగా పదోన్నతి, బదిలీలు
ఉండాలి
సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండొద్దు
సంస్థకు రూ.50వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
అధికారుల క్వార్టర్లకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి
అధికారుల ఐఐఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలి.
సింగరేణి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. సకాలంలో పీఆర్పీ బకాయిలు చెల్లించకపోవడంతో అసంతృప్తి పెరిగింది. అనేక విధాలుగా ఆందోళనలు నిర్వహించాం. యాజమాన్యం స్పందించకపోవడం బాధగా ఉంది. అధికారులకు రావాల్సిన పీఆర్పీతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించాలి. డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదు. న్యాయమైన డిమాండ్‌లను సింగరేణి యాజమాన్యం పరిష్కరించాలి.
– నజీర్, సీఎంఓఏఐ ఏరియా అఽధ్యక్షుడు


