పోలియో రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోలియో రహిత సమాజమే లక్ష్యం

Jun 29 2026 1:05 AM | Updated on Jun 29 2026 1:05 AM

గణపురం: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా తల్లితండ్రులు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. గణపురం మండలం చెల్పూరు పీహెచ్‌సీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లితండ్రులు నిర్లక్ష్యం చేయకుండా పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఆరోగ్యకేంద్రాలతో పాటు సబ్‌సెంటర్లు, బస్టాండ్లు తదితర ప్రాంతాలలో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తున్నారని.. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

34,728 మందికి పోలియో చుక్కలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 34,728 మంది చిన్నారులకు ఆదివారం పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యారోగ్యాశాఖ అఽఽధికారి డాక్టర్‌ మధుసూదన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేయడానికి 296 బూత్‌లు, 14 మొబైల్‌ బృందాలు, 14 ట్రాన్సిట్‌ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి 1,184 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు. పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారుల కోసం నేడు (సోమవారం), 30 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు.

పకడ్బందీగా పల్స్‌పోలియో

మహాముత్తారం: పల్స్‌పోలియో కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్‌ అన్నారు. ఆదివారం మండలంలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా మహాముత్తారం, కోనంపేట, యామన్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండలంలో 1,666 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు చెప్పారు. డీఎంహెచ్‌ఓ వెంట మండల వైద్యాధికారి సందీప్‌ ఉన్నారు.

పల్స్‌పోలియో కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి మధుసూదన్‌

చెల్పూరు ఆరోగ్యకేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు

ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement