‘విత్తు’కోని ఆశలు | - | Sakshi
Sakshi News home page

‘విత్తు’కోని ఆశలు

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

రైతులు ఆందోళన చెందొద్దు..

జిల్లాలో వర్షాభావ

పరిస్థితులు

మొలకెత్తని పత్తి గింజలు

మళ్లీ విత్తుతున్న రైతులు

జలాశయాల్లో అడుగంటుతున్న నీరు

వరి, మిర్చి పంటల సాగుపై ఆందోళన

ప్రధాన జలాశయాల్లో

నీటి నిల్వ వివరాలు

(మిలియన్‌ ఘనపు అడుగుల్లో)..

జలాశయం సామర్థ్యం ప్రస్తుతం

గణపసముద్రం 380 151

బొగ్గులవాగు 406.56 80.10

భీంఘన్‌పూర్‌ 380 151

20వేల ఎకరాల్లో మొలకెత్తని పత్తి విత్తనాలు..

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లాలో సుమారు 2,36,734 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తిపంట 1,06,560 ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేయగా, తొలకరి వర్షాలకు సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పత్తిగింజలు నాటారు. వర్షాలు ముఖం చాటేయడం, అప్పుడప్పుడు చిరుజల్లులు మాత్రమే కురియడంతో సుమారు 20వేల ఎకరాల్లో పత్తిగింజలు మొలకెత్తలేదు. దీంతో రైతులు చేసేది లేక గడిచిన రెండు రోజులుగా మళ్లీ (పోగుంటలు) మొలకెత్తని చోట పత్తి విత్తనాలు వేస్తున్నారు. పత్తి మొలిచిన చోట మొక్కలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. బోర్ల ద్వారా నీటిని అందిస్తుండగా మరికొందరు ముందస్తుగా స్ప్రింకర్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు.

ఏడు మండలాల్లో తక్కువ వర్షపాతం..

జిల్లాలోని 12 మండలాల్లో ఏడు మండలాల్లో జూన్‌ నెలలో తక్కువ వర్షాపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 120.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 109.9 మాత్రమే నమోదైంది. మహదేవపూర్‌, పలిమెల, మల్హర్‌, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లో తక్కువ వర్షాపాతం నమోదు కాగా.. అతి తక్కువగా మొగుళ్లపల్లి మండలంలో ఈ నెల మొత్తంలో 57.1 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈ నెలలో జిల్లావ్యాప్తంగా ఆరు రోజులు మాత్రమే వర్షం కురిసినట్లుగా అధికారులు వెల్లడించారు.

వరి, మిర్చి సాగుపై ఆందోళన..

ఎల్‌నినో ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ హెచ్చరించడంతో జిల్లాలో వరి, మిర్చి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లు, బావులు ఉన్నవారు సాగుకు సిద్ధం అవుతుండగా వర్షం మీదే ఆధారపడే వారు ఇతర పంటలను సాగు చేయాలని భావిస్తున్నారు. బోర్లు ఉన్నప్పటికీ వర్షాలు కురవకపోతే భూగర్భజలాలు అడుగంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాల కోసం రైతులు ఆందోళన చెందవద్దు. ఎల్‌పినో ప్రభావం జిల్లాలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక వరి వంగడాలు, పప్పు దినుసులు, అపరాలను సాగు చేయాలి. ఈ పంటలు వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటాయి.

– బాబురావు,

జిల్లా వ్యవసాయాధికారి

మహదేవపూర్‌లో

రెండోసారి

పత్తిగింజలు వేస్తున్న రైతులు

అన్నదాతలకు ఈ ఏడాది తిప్పలు తప్పేలా లేదు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రైతులు పత్తి గింజలు నాటి పది రోజులు కావస్తున్నా.. అవి మొలకెత్తకపోవడంతో మళ్లీ గింజలు వేయాల్సి వస్తుంది. మొలకెత్తిన మొక్కలను సైతం కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పత్తి సాగే ఇలా ఉంటే మిర్చి, వరి పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – భూపాలపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement