కాళేశ్వరం: శనిత్రయోదశి సందర్భంగా కాళేశ్వరం దేవస్థానంలోని బాలాలయంలో ఆదిముక్తీశ్వరస్వామి వద్ద శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం ఆదిముక్తీశ్వరాలయం వద్ద శని పూజలు, కాలసర్ప పూజలు, అభిషేక పూజలు, కుంకుమార్చనలు వేర్వేరుగా నిర్వహించారు. వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.2.94లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేశ్ తెలిపారు.
సామూహికంగా శనిపూజలు నిర్వహిస్తున్న భక్తులు


