పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

ములుగు రూరల్‌: జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఆరోగ్యశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రణాళిక ప్రకారం పోలియో కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో 22,572 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారని 312 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 రూట్లు, బస్టాండ్‌ వద్ద బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి సుధీర్‌, వ్యాధి నిరోదక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీకాంత్‌, రంజిత్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ దుర్గారావు, సాంబయ్య, స్వరూప, సురేష్‌బాబు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

రైస్‌ మిల్లర్ల సమస్యలు

పరిష్కరించాలి

ములుగు రూరల్‌: రైస్‌ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాదం ప్రవీన్‌కుమార్‌ అన్నారు. శనివారం మంత్రి సీతక్కను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారుతుందన్నారు. వర్షాలకు రంగు మారి ఎఫ్‌సీఐ బియ్యం దిగుమతులు చేసుకోవడం లేదని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement