పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ

Jun 28 2026 2:44 AM | Updated on Jun 28 2026 2:44 AM

రేగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నకిలీ ఓటర్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. శనివారం మండలకేంద్రంలో సర్‌లో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలని కోరారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందజేయాలని తెలిపారు. ఓటరుగా అర్హత ఉన్న వారు తమ పేరు నమోదు చేయించుకోవాలని, అనర్హుల పేర్ల తొలగింపునకు సహకరించాలని కోరారు. అనంతరం మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మొబైల్‌ టీబీ ఎక్స్‌రే స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. రావులపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాధుల బారిన పడకుండా చి న్నారులకు తప్పకుండా టీకా ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్‌, తహసీల్దార్‌ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర రావు, సర్పంచ్‌ మౌనిక, ఆశవర్కర్లు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement