పోలియో ఆదివారం | - | Sakshi
Sakshi News home page

పోలియో ఆదివారం

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

పకడ్బందీగా నిర్వహిస్తాం..

భూపాలపల్లి అర్బన్‌: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం 0–5 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులకు రేపు (ఆదివారం) పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 12 మండలాల పరిధిలో 34,728మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఇందుకుగాను బూత్‌లకు గాను 4 రూట్లలో 14 మంది సూపర్‌వైజర్లను ఏర్పాటు చేసి ప్రతీ బూత్‌కు నలుగురి ఇబ్బంది చొప్పున సిబ్బందిని నియమించారు. 14 మొబైల్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 1,951 వాయిల్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఈ నెల 29, 30వ తేదీలలో ప్రతీ గ్రామంలో వైద్యసిబ్బంది, అంగన్‌వాడీలు ఇంటింటా సర్వే నిర్వహించి చుక్కులు వేసుకోని వారికి అక్కడే వేయనున్నారు.

రెండేళ్ల తర్వాత పల్స్‌పోలియో

పల్స్‌పోలియో కార్యక్రమాన్ని 2024 మార్చి నెలలో నిర్వహించారు. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించేందు కు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌ ఎప్పటికప్పుడు వైద్యాధికారులు, సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ చిన్నారికి గుర్తించి తప్పకుండా రెండు చుక్కుల మందును వేయాలని కలెక్టర్‌ వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆ దేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అసిస్టెంట్లు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలతో ఆయా శాఖల సమన్వయంతో వందశాతం లక్ష్యం చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు.

పోలియో రహిత సమాజం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తూ 0–5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిస్తాం. తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా వేయించాలి. ప్రతీ ఏడాదిలో రెండు సార్లు వేయించాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి ఉంటుంది. బస్టాండ్‌లు, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండే స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఇటుక బట్టీలు, ఇతర పని స్థలాలను కూడా గుర్తించాం.

– చల్ల మధుసూదన్‌,

జిల్లా వైద్యారోగ్యశాఖ అఽధికారి

రేపటి నుంచి మూడు రోజులు

పల్స్‌పోలియో

0–5 సంవత్సరాల లోపు

చిన్నారులకు రెండు చుక్కులు

జిల్లా వ్యాప్తంగా 296 బూత్‌ల ఏర్పాట్లు

1,951 పోలియో వాయిల్స్‌ నిల్వలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement