భూపాలపల్లి రూరల్: డ్రగ్స్ రహిత తెలంగాణ అందరి ధ్యేయమని.. డ్రగ్స్ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్‌సెంటర్ వరకు నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా భూపాలపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సంకీర్త్‌తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. యువ త డ్రగ్స్‌కు దూరంగా ఉండి తమ భవిష్యత్‌ను సురక్షితంగా నిర్మించుకోవాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువకులు తమ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్‌చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణరావు


