కంటి చూపుతో ఇబ్బంది ఉందని.. | - | Sakshi
Sakshi News home page

కంటి చూపుతో ఇబ్బంది ఉందని..

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

చిట్యాల: కంటి చూపుతో ఇబ్బంది ఉందనే మనస్తాపంతో ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిట్యాల మండం ఒడితల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలకుంట్ల సమ్మయ్య(76) కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందులో కంటి చూపు కూడా ఒకటి. దీంతో భార్య రాజమ్మ సాయంతో దినచర్యలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య, పిల్లల కు భారం కావొద్దనే ఉద్దేశంతో శుక్రవారం తెల్లవా రుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లేచి చూడగా సమ్మయ్య బయట బాత్‌రూమ్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో లబోది బోమంటూ గ్రామస్తులకు తెలుపగా వారు మృతదేహాన్ని కిందికి దింపారు. మృతుడి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్‌ పేర్కొన్నారు.

కొర్కిశాలలో యువకుడు..

మొగుళ్లపల్లి: కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొర్కిశాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండారపు మహేందర్‌ (30) దంపతులకు కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపం చెందిన మహేందర్‌ గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసున్నాడు. కుటుంబీకులు శుక్రవారం తెల్లవారుజామున చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్‌ పేర్కొన్నారు.

వృద్ధుడి ఆత్మహత్య..

ఒడితల గ్రామంలో ఘటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement