భూపాలపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్‌మార్క్స్ కాలనీ, 4వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి బూత్‌స్థాయి అధికారులు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు చెత్త సేకరణ వాహనాల ద్వారా చాటింపు నిర్వహిస్తూ ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, జీపీఓ కిరణ్, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


