మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌లో గతేడాది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 18మంది ఉండేవారు. హాస్టల్ భవనంలో ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. దీంతో రూ.15లక్షలతో ఫ్లోరింగ్, ప్రహరీ నిర్మాణ పనులను చేపట్టారు. ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఒక్క విద్యార్థి కూడా ఇంకా హాస్టల్‌కు రాలేదు. ఈ హాస్టల్‌తో పాటు ఎస్సీ హాస్టల్ వార్డెన్ సైతం స్థానికంగా ఉండటం లేదు. దీంతో తల్లితండ్రులు తమ పిల్లలను హాస్టల్‌లో చేర్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు.


