సర్‌.. మీ ఓటు భద్రం | - | Sakshi
Sakshi News home page

సర్‌.. మీ ఓటు భద్రం

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

‘సర్‌’లో ముఖ్యమైన తేదీలు

పారదర్శకంగా ‘సర్‌’

నేటి నుంచి ఇంటింటికీ బూత్‌ స్థాయి అధికారులు

జిల్లాలో ఓటర్ల వివరాలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా ‘స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌’ (సర్‌) కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానుంది. నకిలీ ఓట్లు, ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించడమే ధ్యేయంగా అధికార యంత్రాంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా ఓటు హక్కు కల్పించనున్నారు. నేటినుంచి ఇంటింటికీ బూత్‌ స్థాయి అధికారులు రానున్నారు.

2002 తర్వాత మళ్లీ ఇప్పుడు..

జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం, మంథని నియోజకవర్గంలోని కాటారం డివిజన్‌ పరిధిలోని మండలాల పరిధిలో గతంలో 2002లో చివరిసారిగా ‘సర్‌’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్‌ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. నేటి (గురువారం) నుంచి జూలై 24 వరకూ బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తారు.

ఫాం–2లో ఏమి నింపాలి..

‘సర్‌’ కార్యక్రమంలో ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్‌ ఫాం–2 నింపి, బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరుంటే.. ఆ వివరాలు ఎన్యూమరేషన్‌ ఫాంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతరత్రా కుటుంబీకుల పేర్లు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య/భర్త పేరు, వారి ఎపిక్‌ నంబర్‌(అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించి బీఎల్‌ఓకు అందజేస్తే ఇందుకు రసీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి.

బూత్‌ లెవెల్‌ ఏజెంట్లదే కీలకపాత్ర..

బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్న సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఓ) దగ్గరుండి ఓటర్లకు తమ సహాయ, సహకారం అందించాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యర్థి పార్టీదే పైచేయి అవుతుంది. ఎన్నికల సమయంలో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు లేవని ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు.

జూన్‌ 25 నుంచి జూలై 24వ తేదీ వరకూ బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు.

సెప్టెంబర్‌ 3 నుంచి 28వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు.

అక్టోబర్‌ 1వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం. వచ్చే నెల 24వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. కొత్తగా ఓటరుగా చేరాలంటే ఫాం–6, చిరునామా మార్పునకు ఫాం–8, అనర్హుల పేర్లు తొలగింపునకు ఫాం–7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 18వ తేదీ వరకూ వాటిని పరిశీలించి, అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరు చేరుస్తారు. సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తాం.

– రాహుల్‌శర్మ, కలెక్టర్‌

జాగ్రత్తగా లేకపోతే

ఓటు కోల్పోయే ప్రమాదం

24 ఏళ్ల తర్వాత స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియ

2002 ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల పరిశీలన

పురుషులు 1,87,688

మహిళలు 1,95,564

ఇతరులు 18

బీఎల్‌ఓలు 317

సూపర్‌వైజర్లు 34

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement