భూపాలపల్లి అర్బన్: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాలలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు 34,728వేల మంది ఉన్నారని.. పోలియో చుక్కలు అందించేందుకు విస్త్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో భాగంగా తల్లిదండ్రులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వంద శాతం పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించాలని కోరారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, చేయడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 14 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసినట్లయితే 94405 86982, 6303239891 నంబర్లకు సమాచారం అందించాల ని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
నవజాత శిశు సంరక్షణ, శిశు మరణాల నివారణపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ అధ్యక్షత వహించగా జీజీహెచ్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడారు. ఈ సమావేశంలో జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ నాగ శశికాంత్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సంధ్య, డాక్టర్ సురేందర్, పీడియాట్రిక్ విభాగం వైద్యులు, పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్


