ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం పీఆర్‌టీయూటీఎస్‌ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అన్నారు. ఉ ద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డు సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరా రు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సా నుకూలంగా స్పందించాలని, లేకపోతే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్‌, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement