నాటాల్సిన మొక్కల వివరాలు.. (లక్షల్లో..)
వర్షాలు కురిస్తే మొక్కలు నాటిస్తాం..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో 12వ విడత హరిత మహోత్సవంలో డీఆర్‌డీఏ ద్వారా 15,74,593 లక్షల మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం అంతా సిద్ధంచేసింది. అందుకు అనుగుణంగా గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచారు. అదనంగా అటవీశాఖ, సింగరేణి. ఏఎంఆర్ తాడిచర్ల మైనింగ్ వారు అదనంగా నర్సరీల్లో మొక్కలు పెంచడానికి సిద్ధం చేశారు. జిల్లాలో వానలు కురుస్తున్న తరుణంలో అన్ని గ్రామపంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి నాటే విధంగా చర్యలు చేపట్టనున్నారు.
లక్ష్యం..
గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 15,74,593 మొక్కలు నాటనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 1.40లక్షల వరకు, సింగరేణి ఏఎంఆర్ తాడిచెర్ల మైనింగ్ వారు అదనంగా ప్లాంటేషన్ చేయనున్నారు
పలు రకాల మొక్కలు..
హరితహారంలో ప్రజలు ఎక్కువగా కోరుకునే మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. పండ్లు నీడనిచ్చే మొక్కలనే ఎక్కువగా నర్సరీల్లో పెంపు చేశారు. బాదం, వేప, కానుగ, చింత, మామిడి, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, గులాబీ, మందార, అటవీ శాఖ ఆధ్వర్యంలో నేరేడు, మర్రి, మద్ది, నానేప, వెదురు, సండ్ర తదితర మొక్కలను నర్సరీల్లో పెంచారు. పండ్లు, నీడనిచ్చే మొక్కలను గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో పెంచుతుండగా పూల మొక్కలు ఎక్కువగా సింగరేణి నర్సరీలో పెంచారు.
మండలం గ్రామాలు లక్ష్యం
భూపాలపల్లి 26 1,67,358
కాటారం 24 1,61,328
మొగుళ్లపల్లి 26 1,60,368
చిట్యాల 26 1,55,598
రేగొండ 23 1,50,850
టేకుమట్ల 25 1,38,207
గణపురం 17 1,36,167
మహాముత్తారం 24 1,35,132
మహదేవపూర్ 18 1,27,254
మల్హర్ 15 1,06,287
కొత్తపల్లిగోరి 16 94,542
పలిమెల 08 41,502
15.74 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం
వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు
మొక్కల పెంపకానికి కసరత్తు షురూ
వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కార్యక్రమాన్ని జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వానలు పూర్తిస్థాయిలో కురిస్తే వారం, పది రోజుల్లో మొక్కలు నాటించే కార్యక్రమం ప్రారంభిస్తాం.హరితమహోత్సవంలో గ్రామాల ప్రజలు, యువకులు భాగస్వాములై విజయవంతం చేయాలి.
– బాలకృష్ణ, డీఆర్‌డీఓ


