కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటుచేసిన బాలాలయంలో మంగళవారం కాలసర్ప, శనిపూజలను భక్తులు ని ర్వహించారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దేవాదాయశాఖ ఏర్పాటుచేసిన బాలాలయంలో కాలసర్ప నివారణ, శని పూజలను సామూహికంగా నిర్వహించారు. అనంతరం అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో సందడి నెలకొంది. ఇటీవల కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణ, తొలగింపు ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో పూజలను దేవస్థానం సమీపంలోని అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తున్నారు.
దుకాణాలు డేరాల్లోనే..
కాళేశ్వరం దేవస్థానంలో వివిధ దుకాణాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ప్రస్తుతం దేవస్థానం పనులు జరుగుతున్న కారణంగా ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేశారు. వారికి దేవాదాయఽశాఖ సరైన ఏర్పాట్లు చేపట్టలేదు. వర్షంలో కవర్లు కప్పుకొని డేరాల్లో తమ దుకాణాలు నిర్వహిస్తున్నారు. దుకాణాల నిర్వహణకు ప్లాట్‌ఫాం నిర్మించగా అటవీశాఖ అధికారులు అడ్డుకొని పనులు నిలిపివేఽశారు. రిజర్వ్‌ఫారెస్టులో ఉందని నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరించారు. దీంతో నిర్వాహకులను దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. ఇటీవల తమ సమస్యను మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పుకుందామని వెళ్లారు. మంత్రి వద్దకు వెళ్లి వచ్చారని అధికారి వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పలు పత్రికల్లో వార్తలు వస్తే శ్రీమీరే రాయిస్తున్నారనిశ్రీ వారిని అధికారి నిలదీస్తున్నట్లు సమాచారం. పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.


