28న పల్స్‌ పోలియో | - | Sakshi
Sakshi News home page

28న పల్స్‌ పోలియో

Jun 24 2026 12:41 AM | Updated on Jun 24 2026 12:41 AM

మొగుళ్లపల్లి: ఈనెల 28న నిర్వహించే జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి డాక్టర్‌ నవత ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్‌ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ చిరంజీవి, సీహెచ్‌ఓ రాజేంద్రప్రసాద్‌, సూపర్‌వైజర్‌ సునీత, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement