వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
భూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా అధికారులు హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు ఇతర అంశాలపై సీఎం కలెక్టర్లతో చర్చించి పలు ఆంశాలపై ఆదేశాలు జారీచేశారు. అనంతరం కలెక్టర్ ఆధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు మండలస్థాయి బృందాలు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఎస్‌ఓ శ్రీనాథ్, డీఆర్‌డీఓ నరేష్, డీఎం రాములు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


