సన్నబియ్యంతో పేదలకు మేలు | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యంతో పేదలకు మేలు

Apr 9 2025 1:46 AM | Updated on Apr 9 2025 1:46 AM

సన్నబియ్యంతో పేదలకు మేలు

సన్నబియ్యంతో పేదలకు మేలు

భూపాలపల్లి రూరల్‌: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్‌మార్స్‌ కాలనీలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన బానోతు మౌనిక కిషన్‌ నాయక్‌ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని మంగళవారం కుటుంబసభ్యులు, కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భోజనం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో పేదల కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు. భోజనం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మౌనిక. కిషన్‌ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరినట్లు తెలి పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, పౌరసరఫరాల అధికారి రాములు, సివిల్‌ సప్లయ్‌ అధికారి శ్రీనాథ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్‌, శిరుప అనిల్‌, ముంజాల రవీందర్‌, జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, అంబాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

కలెక్టర్‌తో కలిసి సహపంక్తి భోజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement