చిన్న కాళేశ్వరం సర్వే అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మండలంలోని గూడూరు పరిధిలో కొనసాగుతున్న కాల్వ నిర్మాణ సర్వే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. కాల్వ నిర్మాణంతో తాము భూములు కోల్పోయి నష్టపోవాల్సి వస్తుందని, కాల్వ అలైన్‌మెంట్ మార్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పొలాల మధ్య నుంచి కాల్వ నిర్మాణం జరిగితే తమ పంటలకు నష్టం జరుగుతుందని నిర్వాసిత రైతులు అధికారులకు విన్నవించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. చిన్న కాళేశ్వరం డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పారు. డీఈఈ వెంట ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, సర్వే ఇన్‌స్పెక్టర్ రాములు ఉన్నారు.


