
మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. భారతీయుల హృదయాలను ఉత్తేజ పరచిన విప్లవకారుడు భగత్‌సింగ్‌కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. నాటి ఉద్యమ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రామప్పలో
యూరప్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని ఆదివారం యూరప్‌కు చెందిన జెయో, ఇలోనాలు సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆదివారం సెలవుకావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు రామప్పకు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు.
జాతీయ కౌమార విద్యా
సదస్సుకు డాక్టర్ రామయ్య
ములుగు: ప్రాంతీయ విద్యాసంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) బోపాల్‌లో నేడు, మంగళవారం జరగనున్న జాతీయ కౌమార విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపికై నట్లు ములుగు మండలం అబ్బాపురం ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, మనో విజ్ఞానవేత్త డాక్టర్ కందాల రామయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌమారదశలో బాలికలు ఒత్తిడిని ఎదుర్కొనే విధానాలు అనే అంశంపై చేసిన పరిశోధన, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తెలిపేలా వివరించనున్నట్లు వెల్లడించారు.

మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి