పంట సాగు కోసం తీసుకున్న రుణం చెల్లించలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి డబ్బులు ఆపారని కొత్తపల్లిగోరి మండలంలోని బాలయ్యపల్లికి చెందిన యాదగిరి కలెక్టర్ ఎదుట వాపోయాడు. ఇందుకు కలెక్టర్ వెంటనే స్పందించి.. కొత్తపల్లిగోరి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి.. ప్రభుత్వ పథకాల నుంచి వచ్చిన డబ్బులను ఇవ్వకుండా ఎందుకు హోల్డ్‌లో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి డబ్బులు ఇవ్వకుండా ఆపే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చల్లగరిగెలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, మరోమారు పునరావృతం అయితే బ్యాంకర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
బ్యాంక్ మేనేజర్‌పై కలెక్టర్ ఆగ్రహం...