స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాత శ్రీవాణి గురుకుల పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి సీనియర్ షూటింగ్‌బాల్ ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించారు. షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపిక పోటీలకు బాలురు 50 మంది, బాలికలు 70 మంది హాజరైనట్లు తెలిపారు. వారి క్రీడాప్రతిభ ఆధారంగా బాలుర నుంచి 12 మందిని, బాలికల నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారు త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. షూటింగ్‌బాల్ క్రీడను అభివృద్ది చేసేలా ప్రత్యేక చొరతో పనిచేస్తున్నామని తెలిపారు. కౌన్సిలర్ ఎస్.సంపత్‌రాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిషన్‌రాజ్, జీడి రమేశ్, పీడీలు యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, సాంబన్న, సుధాకర్, దిలీప్ పాల్గొన్నారు.


