హన్మకొండ కల్చరల్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి నగరానికి చెందిన కవి, రచయిత, తెరసం వరంగల్ జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఈనెల 26న హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోనున్నారు. పొట్లపల్లి శ్రీనివాసరావు ఇటీవల తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శిగా, మిత్రమండలి తదితర సాహిత్య సాంస్కృతిక కళారంగ సంస్థల్లో సేవలు అందిస్తున్నారు. కవులు అంపశయ్య నవీన్, రామచంద్రమౌళి, డాక్టర్ ఎల్ఎస్ఆర్ ప్రసా ద్, డాక్టర్ బన్న అయిలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, గిరిజా మనోహరబాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


