జనగామ రూరల్: గురునానక్ ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని డీసీపీ రాజమహేంద్రనాయక్ కొనియాడారు. మంగళవారం గురునానక్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఒకటో వార్డు అంబేడ్కర్ నగర్ బస్టాండ్ చౌరస్తాలో ఉన్న గురుద్వార్ శ్రీగురుసింగ్ సభ ఆలయంలో డీసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రఫ్తార్ సింగ్, ప్రేమ్ సింగ్, గురు ప్రేమ్‌సింగ్, బల్వీర్ సింగ్, సమ్ షేర్ సింగ్, సేవా సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
డిసెంబర్ 9 లోగా
డిమాండ్లు నెరవేర్చాలి
రఘునాథపల్లి: తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలం, రూ.25 వేల పింఛన్ అందించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తుమ్మల శోభారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని సచివాలయ తెలంగాణ అమర వీరుల జ్యోతి వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం రఘునాథపల్లికి చేరుకుంది. పాదయాత్రకు ఉద్యమకారులు, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి తదితరులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో అరూరి పూలమ్మ, నరేడ్ల విజయ, కొడిపాక అన్నపూర్ణ, ఇంజ భవాని, రవి, యాకుబ్, కోర్నెలు, సంజీవ, మైసయ్య, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి అథ్లెటిక్స్
ఎంపికలు పూర్తి
జనగామ రూరల్: స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో సబ్ జూనియర్ క్రాస్ కంట్రీ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న సబ్ జూనియర్ క్రీడాకారులు ఈనెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో నిజామాబాద్‌లో జరిగే సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొంటారని, క్రాస్ కంట్రీలో ఎంపికై న వారు డిసెంబర్ 6న నారాయణపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని జనగామ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెద్ది వెంకటనారాయణగౌడ్, గంగిశెట్టి మనోజ్‌కుమార్ తెలిపారు. ఎంపికల్లో ఆవుల అశోక్, వంచ చంద్రశేఖర్‌రెడ్డి, రంజిత్, రవీంద్రప్రసాద్, కుమార్, శ్రీధర్, రాజు, శైలజ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన జీడికల్
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ సీతారామచంద్రస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జామునే భక్తులు ఆలయంపైన ఉన్న జీడిగుండం, పాలగుండాలలో పుణ్యస్నానాలాచరించి సీతారామచంద్రులను దర్శించుకున్నారు. కాగా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.


