– మరిన్ని ఫొటోలు 9లోu
ఆధ్యాత్మిక వైభవం..
దేదీప్య కార్తీకం
శివనామస్మరణతో
మార్మోగిన సిద్ధులగుట్ట
బచ్చన్నపేట : మండలంలోని కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు ఉపవాసాలు, దీపారాధనలు నిర్వహించారు. భారీసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ చిందం వంశీ, ప్రధానపూజారి ఓం నమఃశివాయ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
జనగామ: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శివాలయాలు, వైష్ణవాలయాలకు చేరుకుని ఉసిరిచెట్టు కింద ఉసిరి దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. జనగామ మండలం చీటకోడూరు శ్రీ పంచకోశు రామలింగేశ్వర స్వామి, పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ కన్యకాపరమేశ్వరి, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర స్వామి, అమ్మబావి శ్రీ ఉప్పలమ్మ సహిత ఆంజనేయ శివాలయం, గీ తాశ్రమం భక్తులతో కిటకిటలాడాయి. బాణాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, పీఠం ఆస్థాన సిద్ధాంతి తిరుమల చక్రవర్తుల సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతి మాట్లాడుతూ.. త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళశాసనాలు అందించినట్లు తెలిపారు.


