కరువు సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్‌

జనగామ రూరల్‌: కరువు కోరల్లో అలమటిస్తున్న రైతులను ఆదుకొని కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్‌, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం సింగారపు రమేశ్‌ అధ్యక్షతన ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు..వేలాదిమంది కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పనిని 200 రోజులు కల్పించాలన్నారు. రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. కార్యక్రమంలో బూడిద గోపి, సుంచు విజేందర్‌, బోడ నరేందర్‌, పోత్కనూరి ఉపేందర్‌, బిట్ల గణేష్‌, బెల్లంకొండ వెంకటేష్‌, ఆకుల శ్రీనివాస్‌, చిట్యాల సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement