జనగామ రూరల్: వయసు మీద పడడంతో పనులు చేసుకునే శక్తి లేక కుటుంబంపై ఆధార పడలేక, కనీస అవసరాలు తీర్చుకునేందుకు పండుటాకులు నానా కష్టాలు పడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. దరఖాస్తులు తీసుకుంటున్నారే తప్ప కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదని, తమకు పింఛన్లు వచ్చేలోగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో లేదో అని వాపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పింఛన్లు మంజూరు చేయగా వృద్ధులకు, బీడీ, హెచ్‌ఐవీ, డయాలసిస్ బాధితులకు మంజూరు చేయలేదు. ఇందులో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులను కనుకరించకపోవడంతో వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి. జిల్లా వ్యాప్తంగా 5వేలకు పైగా వృద్ధులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
నాలుగేళ్లుగా ఎదురుచూపులే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు 2022 జూన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. అర్హత ఉన్న దరఖాస్తులు స్వీకరించినా పింఛన్ రాలేదు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్లు మంజూరు చేయగా వృద్ధులకు ఇవ్వకపోవడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయినప్పటికీ వృద్ధాప్య పింఛన్ల మంజూరుపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురవుతున్నారు.
హామీలకే పరిమితం..
అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించింది. అయితే ఈ హామీలు అమలుకు నోచుకోలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వ్కీరించిన వృద్ధులకు పింఛన్లు అందడం లేదు.
65 ఏళ్లు దాటినా అందని ఆసరా..
వృద్ధాప్య పింఛన్ కోసం నిరీక్షిస్తున్న వారిలో 65 ఏళ్లు దాటినవారు కూడా ఉన్నారు. వయసు పైబడడంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కూలీ పనులకు వెళ్లలేక, పిల్లలపై ఆధారపడలేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాప్యంలో బీపీ, షుగర్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. క్రమం తప్పకుండా మందులు వాడాల్సి రావడంతో నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పింఛన్ అందితే మందులు, నిత్యావసరాలకు కొంతైనా వెసులుబాటు ఉంటుంది. పింఛన్ లేకపోవడంతో చిన్నచిన్న అవసరాలకు కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో బతకాల్సిన తాము ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నా..
నాకు 75 ఏళ్లు దాటాయి. ఆరు సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నా. ఇప్పటికీ మంజూరు కాలేదు. తాజాగా దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేరు లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా అర్హతను గుర్తించి అధికారులు విచారణ చేసి పింఛన్ మంజూరు చేయాలి.
–పుప్పాల సత్యనారాయణ, ఖిలాషాపురం
చేనేత కార్మికులు
ఒంటరి మహిళలు
గీతకార్మికులు
దివ్యాంగులు
వితంతువులు
వృద్ధాప్య (పాతవి)
నాలుగున్నరేళ్లుగా పింఛన్ల కోసం
ఎదురుచూపులు
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం
కొత్త పింఛన్ల మంజూరులో వృద్ధులకు ఏదీ భరోసా?
ప్రభుత్వం కనికరించాలని వేడుకుంటున్న ఆశావహులు
5వేల మంది నిరీక్షణ
9,669
1,651
2,048
1,986
3,912
12,401
30,556
29,402


