చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చిదురాల ఆర్యన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం విజయ్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ జాటోతు దేవ్‌సింగ్ సోమవారం తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో వరంగల్ జిల్లా అన్నారంలో నిర్వహించిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో సత్తాచాటి ఈనెల 26–28 తేదీలలో ఉత్తరప్రదేశ్‌లోని మేన్పూరిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలో చదివే ఆర్యన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నందున ఆమె ప్రయాణ ఖర్చులను ఇదే పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కోమలి రూ.6వేలు నగదు అందించారు. ఆర్యనను చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, సర్పంచ్ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు చిర్ర నాగరాజు, జీడి రేణుక, జీడి జాన్ అభినందించారు.


