42శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

42శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలి

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

హన్మకొండ అర్బన్‌: రెండో వేతన సవరణ సంఘం నివేదికను తెప్పించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం ఐడీఓసీలోని టీజీఓ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్‌కుమార్‌ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరరవ్వగా.. జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సమావేశాన్ని ప్రారంభించారు. పలు అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, కోశాధికారి రాజేష్‌ కుమార్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్‌, రాష్ట్ర కార్యదర్శులు కిరణ్‌ కుమార్‌ గౌడ్‌, కోల్‌ రాజేష్‌, అస్నాల శ్రీనివాస్‌, అన్వర్‌ హుస్సేన్‌, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌రావు, తస్లీమా, మాధవరెడ్డి, డాక్టర్‌ రజినితోపాటు పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement