● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
జనగామ రూరల్: కక్షిదారుల కేసుల పరిష్కారానికి న్యాయవాదుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. వచ్చే నెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాని న్యాయమూర్తి బి.ప్రతిమ న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ..జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం సుప్రీంకోర్టు జడ్జిలచే గుర్తించబడిన అక్రిడిటేషన్ సర్టిఫికెట్ను న్యాయవాది భిక్షపతికి అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సందీప్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


