రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవాలి

Nov 24 2026 1:54 AM | Updated on Nov 24 2026 1:54 AM

● సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి

లింగాలఘణపురం: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రాజారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని కురమ సంఘం భవనంలో సీపీఐ మండల పార్టీ, ప్రజాసంఘాల విస్తృత స్థాయి సమావేశం మండల కార్యదర్శి సదానందం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోనికి వచ్చే ముందు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చడంలేదని, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కార్పోరేట్‌ సంస్థలకు భారీ మొత్తాలను రుణమాఫీ చేస్తూ సన్నచిన్నకారు రైతాంగాన్ని ముక్కిపించి వసూలు చేస్తోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, రేషన్‌ దుకాణాల నుంచి 14 రకాల వస్తువులను అందజేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి సాయన్న, నాయకులు వీరస్వామి, ఎల్లయ్య, రాములు, యాదగిరి, బిక్షపతి, వెంకన్న, శేఖర్‌, సంపత్‌, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement